వెలుగు బిజినెస్ డెస్క్: గ్లోబల్‌గా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులన్నీ టెక్నాలజీ కోసం ఇండియా, ఇతర సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల వైపే చూస్తున్నాయి. దీంతో రాబోయే ఏళ్లలో మన దేశంలో టెక్నాలజీ ఉద్యోగాలు భారీగా పెరగనున్నాయి. టెక్నాలజీ అవసరాల కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఏకంగా 93 బిలియన్ డాలర్లను డీల్స్‌పై వెచ్చించనున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం అవసరమైతే కంపెనీలను కొనడానికి సైతం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు రెడీ అవుతున్నట్లు పేర్కొంటున్నాయి.
టెక్నాలజీపైనే ఫోకస్...
గ్లోబల్ ప్లేయర్లు బార్క్లేస్ పీఎల్సీ, సిటీ గ్రూప్‌లు తమ ఆఫీసులలో కొత్త సీనియర్ రోల్స్‌ను తెచ్చాయని, ఇక రీజినల్ ప్లేయర్లు ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంతోపాటు, ఐపీఓల వైపూచూస్తున్నాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. అన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులూ టెక్నాలజీపైనే ఫోకస్ పెడుతున్నాయి. టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ సెగ్మెంట్స్‌లో ఎక్స్పర్టుల కోసం చూస్తున్నాయని టీఎంటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మీనన్ చెప్పారు. కొత్త తరపు బ్యాంకర్ల అవసరం చాలా ఉందని, వారు ఎంట్రప్రెనూర్లలాగా ఆలోచించగల వారై ఉండాలని పేర్కొన్నారు. గతంలో ఈ పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు టెక్నాలజీ కోసం జపాన్, సౌత్ కొరియా, కొంత కాలం కిందటిదాకా చైనా వైపు చూసేవి. కరోనా వైరస్ రావడంతో చాలా దేశాలలో ఈ–కామర్స్ ఊపందుకోవడంతోపాటు, రిమోట్ వర్కింగ్ పెరగడం వల్ల ఇతర మార్కెట్లపైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఇప్పుడు దృష్టి పెట్టాల్సి వస్తోంది.
