లక్నోలో జీహెచ్ఎంసీ మేయర్, కార్పొరేటర్ల బృందం

లక్నోలో జీహెచ్ఎంసీ  మేయర్, కార్పొరేటర్ల బృందం
  • సీఎం యోగి ఆదిత్యనాథ్​ను కలిసిన టీమ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఆధర్యంలో 40 మంది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ కార్పొరేటర్లు స్టడీ కోసం యూపీలోని లక్నో వెళ్లారు. అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్​ను కలిసి అరగంట పాటు మాట్లాడారు. యూపీ సీఎం మాట్లాడుతూ భాగ్యనగరం అంటే తనకు ఇష్టమని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావడం తనకు నచ్చిందన్నారు.

 హైదరాబాద్ తో పోలిస్తే లక్నో చిన్నదని, 60 లక్షల జనాభా మాత్రమే ఉందన్నారు. తర్వాత విధాన్ సభని సందర్శించాలని సూచించగా మేయర్ బృందం అక్కడికి వెళ్లారు. లక్నో స్మార్ట్ సిటీ ఆఫీస్​లోని కమాండ్ కంట్రోల్​సెంటర్లు, వేస్ట్ టూ వండర్ పార్కును విజిట్​చేశారు.  ఇండోర్ విజిట్​ చేసి మేయర్ బృందం సిటీకి తిరిగి రానుంది.