Hong Kong Sixes 2024: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్, పాక్ జట్లు

నవంబర్ 1 నుండి నవంబర్ 3 వరకు హాంకాంగ్‌ వేదికగా జరగనున్న హాంకాంగ్ సిక్స్‌ల క్రికెట్(Hong Kong Cricket Sixes tournament) టోర్నీలో భారత్, పాక్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ హాంకాంగ్ చైనా అధికారిక హ్యాండిల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.

హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ అనేది ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ టోర్నమెంట్. 1992లోఈ టోర్నీని ప్రారంభించారు. ఈ టోర్నీలో భారత్ చివరిసారి 2005లో పాల్గొంది. టీమిండియా తరుపున సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని వంటి దిగ్గజ ఆటగాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. సంవత్సరాలుగా జరుగుతున్న ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్ అత్యంత విజయవంతమైన జట్లు. ఒక్కొక్కటి ఐదుసార్లు టైటిల్‌ గెలుచుకున్నాయి.

టైటిల్ రేసులో 12 జట్లు

మొత్తం 12 జట్లు తలపడనున్న ఈ టోర్నీ మూడు రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‍లన్నీ హాంకాంగ్ లోని టిన్ క్వాంగ్ రోడ్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు.

ALSO READ | IND vs BAN: కొత్త ఆటగాళ్లలో మనదే పైచేయి.. పాక్ వరల్డ్ రికార్డు బ్రేక్

కాగా. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఆసిఫ్ అలీతో పాటు ఏడుగురు సభ్యుల గల పాక్ జట్టుకు ఆల్ రౌండర్ ఫహీమ్ అష్రఫ్ నాయకత్వం వహించనున్నాడు.

టోర్నీ ఫార్మాట్ ఇలా.. 

ఐదు ఓవర్లు సాగే ఈ మ్యాచ్‌లో ఒక్కో జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. వికెట్ కీపర్ మినహా ప్రతి ఆటగాడు తప్పనిసరిగా ఒక ఓవర్ బౌలింగ్ చేయాలి. ముఖ్యంగా ఈ టోర్నీలో ఆల్ రౌండర్లు కీలక పాత్ర.