ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. ఆస్ట్రేలియాపై ఆధిపత్యం కొనసాగిస్తుంది. కెప్టెన్ అజింక్య రహానే సెంచరీతో చెలరేగడంతో టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రహానే 200 బంతుల్లో 104, జడేజా 40 రన్స్ తో క్రీజులో ఉన్నారు. మూడో రోజు కూడా వీరిద్దరు బ్యాట్ ఝులిపిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఆసిస్ బౌలర్లలో స్టార్క్ కు 2, కమిన్స్ 2, నాథన్ లియోన్ కు ఒక వికెట్ పడ్డాయి.
India vs Australia 2nd Test match, Day 2: Play suspended with Team India on 277/5 at stumps. India lead by 82 runs.
Indian team captain Ajinkta Rahane at 104*, Ravindra Jadeja at 40*
(Pic Courtesy: BCCI) https://t.co/aAg5uFeqCs pic.twitter.com/bPJqBcGU48
— ANI (@ANI) December 27, 2020
