మిస్టర్ అండ్ మిసెస్ చహల్
టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను మంగళవారం పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలంగా ధనశ్రీ వర్మతో చహల్ డీప్ లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. తనపై వస్తున్న కామెంట్లకు తెరదించుతూ.. ఊహించినట్లే ప్రేయసిని సొంతం చేసుకున్నాడు చహల్. ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. పెళ్లి ఫొటోలను చహల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లైఫ్‌లో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన యంగ్ క్రికెటర్ కు టీమ్ మేట్స్, పలువురు సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు.
