నవంబర్ 8న సౌతాఫ్రికాతో భారత్ నాలుగు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సూర్య కుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ సిరీస్ కోసం భారత యువ జట్టు సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. భారత క్రికెటర్లు డర్బన్‌కు చేరుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డర్బన్ చేరుకున్న తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా సంస్కృతిపై సరదాగా క్విజ్ ఆడారు. అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ వినోదాన్ని పంచారు.
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఈ సిరీస్ కు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో ఉండడం లేదు. గంభీర్ స్థానంలో దక్షిణాఫ్రికా టూర్‌కు స్టాండ్-ఇన్ హెడ్ కోచ్‌గా లక్ష్మణ్‌ను బీసీసీఐ నియమించింది. లక్ష్మణ్ తో పాటు సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కనిట్కర్, శుభదీప్ ఘోష్ కోచింగ్ స్టాఫ్ గా లక్ష్మణ్ తో ఉంటారు.
నవంబర్ 8, 10, 13, 15వ తేదీల్లో సౌతాఫ్రికాతో నాలుగు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో తొలి టీ20 తో సిరీస్ ప్రారంభమవుతుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ లో రెండో టీ20 జరుగుతుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్, జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో వరుసగా మూడు, నాలుగు టీ20 మ్యాచ్ లకు ఆతిధ్యమిస్తాయి.
భారత్ తో సిరీస్ కు దక్షిణాఫ్రికా టీ20 జట్టు:
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మాన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రుగర్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ సిర్డిపెలనేటన్, ఆండిలే స్ర్డిపెలనేటన్ (3,4వ టీ20), ట్రిస్టన్ స్టబ్స్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత జట్టు:
సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, అవేష్ ఖాన్ , యష్ దయాల్.
Touchdown Durban ???
— BCCI (@BCCI) November 4, 2024
How good is #TeamIndia's knowledge of their next destination ?#SAvIND pic.twitter.com/m4YjikAw6Y