బాలికలతో టీచర్ అసభ్య ప్రవర్తన.. ఎంఈఓకు పేరెంట్స్ ఫిర్యాదు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ​జిల్లా ధారూర్ గవర్నమెంట్ హైస్కూల్​లో టీచర్ కిష్టయ్య తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థినులు ఆరోపించారు. దీంతో టీచర్ నిర్వాకంపై నిలదీసేందుకు  బాలికల తల్లిదండ్రులు గురువారం స్కూల్​కు వెళ్లారు. సదరు టీచర్ సెలవుపై ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓకు ఫిర్యాదు చేశారు.