ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా టీడీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ మీద కక్షతో …అన్న క్యాంటీన్లు మూసేసి ….పేద వారి కడుపులు కొట్టవద్దన్నారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అన్న క్యాంటీన్లు ప్రారంభించే వరకు ఆందోళనలు కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
