కడప జిల్లా: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బిటెక్ రవిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. 2018 లో పులివెందులలో టీడీపీ-వైసీపీ మధ్య జరిగిన అల్లర్ల కేసులో బిటెక్ రవిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయడంతో చెన్నై ఎయిర్ పోర్టులో నిన్న బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా 14 రోజులు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య బీటెక్ రవిని కడప సెంట్రల్ జైల్ కు తరలించారు.
కరోనాతో ఇంట్లోనే ఫేషియల్, హెయిర్ ప్యాక్‌లు
బెల్లం నీళ్లతో బరువు తగ్గొచ్చు
మన వ్యాక్సిన్ల రేటెంత? పనితీరెంత?
