40ఏళ్ళ చరిత్ర కలిగిన టీడీపీకి నేడు రాజ్యసభలో ఉనికి కోల్పోయిన దుస్థితి దాపురించింది. పార్టీ స్థాపించిన ఏడాది లోపే మదగజం అప్పటి మదగజం లాంటి కాంగ్రెస్ పార్టీని సైతం ఓడించిన చరిత్ర గల పార్టీ ఇప్పుడు తన అనుభవంలో సగం కూడా లేని వైఎసార్సీపీ ధాటికి నిలబడలేక పెద్దల సభలో ప్రాతినిధ్యం కోల్పోవటం బహుశా దేశ రాజకీయచరిత్రలో ఇదే ప్రధమం అని చెప్పచ్చు. రాజ్యసభలో స్థానాల కోసం పార్టీకి కావాల్సిన అర్హత వంటి టెక్నీకల్ అంశాలను పక్కన పెడితే ఈ పరిణామం చాలా వరకూ టీడీపీ శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశం అనే చెప్పాలి.
కేంద్రంలో చక్రం తిప్పి దేశ ప్రధానిని సైతం నిర్ణయించగల సత్తా ఉన్న చాణక్యుడు చంద్రబాబు అధ్యక్షతన నడుస్తున్న పార్టీకి ఈ గతి పట్టడం చాలా బాధాకరం. తెలుగుజాతికి సెల్ ఫోన్ నుండి కంప్యూటర్ వరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే అయితే, ఇప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పుకునే టీడీపీ పార్టీ రాజ్యసభలో ఉనికి కోల్పోవటానికి కూడా ఆయన ఘనతే కారణం అని చెప్పాలి.
పార్టీలో తాను మాత్రమే పవర్ సెంటర్ గా ఉండాలని భావించటం, అందుకోసం పార్టీ స్థాపించిన నాటి నుండి ఉన్న సీనియర్లకు సైతం ప్రాధాన్యత ఇవ్వకుండా ఓడిపోయిన తన సుపుత్రుడిని దొడ్డిదారిన మంత్రిని చేయటం వంటి అంశాలు ఎన్నో అంశాలు ఉన్నాయి.ఇలా చెప్పుకుంటూ పోతే చాట భారతం అయినా ముగించవచ్చునేమో కానీ, టీడీపీ పతనానికి గల కారణాల చిట్టా మాత్రం ముగించలేము.