ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కూటమి శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా పిఠాపురం టీడీపీ నేతపై జనసేన శ్రేణులు దాడికి పాల్పడటం ఉద్రిక్తతకు దారి తీసింది.గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో వర్మపై దాడికి పాల్పడ్డారు జనసైనికులు. ఈ దాడితో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేసినందుకు సరైన ఫలితమే ఇచ్చారంటూ టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిపై స్పందించిన వర్మ, ప్లాన్ ప్రకారం చేసిన హత్యాయత్నమే అని అన్నారు. తనను చంపే ఉద్దేశంతోనే జనసేన కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. 20ఏళ్ళ తన రాజకీయ జీవితంలో పిఠాపురంలో ఇలాంటి దాడి జరగటం మొదటిసారని అన్నారు వర్మ.