శత్రువును కూడా పార్టీలో చేర్చుకున్న జగన్..!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మనం తరచూ వింటూ ఉంటాం. అందుకు అనుగుణంగానే రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ కి పురిటిగడ్డ అయిన రాయలసీమలో కూడా దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారుతున్నారు. ఇప్పుడు ఈ ఉపోద్గాతం అంతా ఎందుకంటే పులివెందులలో వైఎస్ ఫ్యామిలీకి గత 20ఏళ్లుగా ప్రత్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డి గురించి చెప్పాలి కాబట్టి.

వైఎస్ కుటుంబం చేతిలో ఓడిపోతూ వస్తున్నప్పటికీ 2004 నుండి వరుసగా వైఎస్ కుటుంబం మీద పోటీకి దిగుతూ వస్తున్నాడు సతీష్ రెడ్డి. అయితే గత నాలుగేళ్లుగా టీడీపీలో యాక్టివ్ గా లేకుండా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ సీటు తనని కాదని బీటెక్ రవికి కేటాయించటంతో నిరాశ చెందిన ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

ALSO READ :- జపానికి 108 సంఖ్యే ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా...

ఇన్ని సంవత్సరాలుగా టీడీపీని అంటిపెట్టుకొని ఉన్న తనను చంద్రబాబు, లోకేష్ లు తీవ్రంగా అవమానించారని, కనీస మర్యాద కూడా ఇవ్వలేదని అన్నారు. తనని పట్టించుకోకపోగా వైఎస్ ఫ్యామిలీతో లాలూచి పడ్డానని నింద మోపారని, అలాంటి నింద మోపాక పార్టీలో ఉండటం దండగ అని డిసైడ్ అయ్యి అనుచరులతో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చానని తెలిపారు సతీష్ రెడ్డి.