కోడెల శివప్రసాద్ కూతురి స్టేట్మెంట్ ఇదే..!

కోడెల శివప్రసాద్ కూతురి స్టేట్మెంట్ ఇదే..!

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకులు కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై… వెస్ట్ జోన్ డీసీపీ ఎఆర్ శ్రీనివాస్ మాట్లాడారు. శివప్రసాద్ బిడ్డ విజయలక్ష్మి స్టేట్మెంట్ రికార్ట్ చేసినట్టు తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నట్లు చెప్పారు.

“నాన్న సోమవారం పొద్దున  టిఫిన్ చేసి పైఅంతస్థులో ఉన్న బెడ్ రూమ్ కు వెళ్లారు. నేను మా అమ్మను హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాను… అయితే నాన్న ఎంతకూ కిందికి రాకపోవడంతో తానే పైకెళ్లి చూడగా… అప్పటికే నాన్న ఉరేసుకుని ఉన్నట్లుగా గుర్తించి, గన్ మెన్, డ్రైవర్ సహాయంతో కిందికి దించానని… ఆ తర్వాత మా నాన్నను బసవతారకం హాస్పిటల్ కు తీసుకెళ్లాము” అని కోడెల శివ ప్రసాద్ కూతురు విజయలక్ష్మి తెలిపారని పోలీసులు చెప్పారు.

ప్రస్తుతం కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఫ్యాన్ కు ఉరేసుకున్న ఆధారాలు సేకరించామని.. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చాకే మరిన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు డీసీపీ ఎఆర్ శ్రీనివాస్.