మరో టీడీపీ నేత రాసలీలలు లీక్: పింఛన్, ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ లొంగదీసుకున్నాడు

ఏపీలో మరో టీడీపీ నేత రాసలీల బాగోతం వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఘటన మర్చిపోకముందే.. ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి.. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిశీలకుడు ఖాదర్ భాషా రాసలీలల వీడియో ఇంటర్నెట్‎లో వైరల్ అయ్యింది. ఖాదర్ భాషా రాసలీలలు ఆయన పర్సనల్ అయినా.. ఆ మహిళను లొంగదీసుకున్న విధానం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. బాధితురాలికి ఇంటి స్థలం ఇప్పిస్తానని.. పింఛన్ ఇప్పిస్తానంటూ ఖాదర్ భాషా ఆ మహిళను లొంగదీసుకున్నట్లు.. ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది. 

ALSO READ | ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. రూ.23 కోట్ల ఆస్తులు అటాచ్

పింఛన్ 4 వేల రూపాయలు కావాలంటే నా దగ్గరకు రావాలంటూ కుప్పం నియోజకవర్గం పరిశీలకుడు ఖాదర్ భాషా కండీషన్ పెట్టినట్లు చెప్పుకొచ్చింది ఆ బాధితురాలు. ఖాదర్ భాషా రాసలీలల వ్యవహారం ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‎గా మారింది. టీడీపీ నేతల రాసలీలల వీడియోలు వరుసగా లీక్ అవుతుండటంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చెందిన కీలక నేత కామక్రీడల వ్యవహారం బట్టబయలు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

మహిళలు విషయంలో తన మన అనే బేధమే చూపించకుండా ఎంతటివారిపైనైనా యాక్షన్ తీసుకుంటామని అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరీ తన సొంత నియోజకవర్గ నేత రాసలీలల బాగోతంపై సీఎం చంద్రబాబు అతడిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాలి. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు వీడియాలు లీక్ కావడంతో అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరీ ఖాదర్ భాషా విషయంలో ఏం జరగుతుందో చూడాలి.