ఏప్రీ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు: చంద్రబాబు  

అమరావతి: ఏపీ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐదేళ్లుగా వైసీపీ ప్రజాస్వామ్య వ్వవస్థలను నీర్విర్యం చేసింది.. ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయార న్నారు చంద్రబాబు. మా కార్యకర్తలను చిత్రహింసలు పెట్టారన్నారు. నా రాజకీయ జీవతంలో గత ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. 

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ఈ ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుంది. ఊహించన విధంగా ప్రజలు ఫలితాలిచ్చారు. ఏపీలో తిరుగులేని తీర్పునిచ్చారన్నారు. అవినీతి పరులకు ఈ ఫలితాలు  చెంపపెట్టు అన్నారు చంద్రబాబు.

ఏపీలో ఐదేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి డ్యామేజీ అయ్యిందన్నారు చంద్రబాబు. ఏపీ ప్రజలను జగన్ అరిగోసలు పెట్టారన్నారు . కేసులతో ప్రజలను , మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు చెప్పారు. ఈ ఐదేళ్లు కంటి నిండా నిద్ర పోలేదన్నారు  చంద్రబాబు.

ఏపీ ప్రజలు మాకు ఒప్పచెప్పిన బాధ్యతలను తప్పక నిర్వర్తిస్తాం.. కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ కృషి చాలా కీలకమైనదన్నారు చంద్రబాబు. కూటమి పెట్టడానికి కారణమే పవన్ కళ్యాణ్ అన్నారు.