క్లైమాక్స్ కి చేరిన టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తు - ఢిల్లీలో సీట్లపైన జోరుగా చర్చలు..!

2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ఉత్కంఠ రేపుతున్న అంశం బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పవన్, బాబు చెరోసారి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసినప్పటికీ పొత్తు విషయం ఎటూ తేల్చలేదు. బీజేపీతో పొత్తుపై ఎలాంటి క్లారిటీ లేకుండానే ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించేశాయి టీడీపీ, జనసేన.

తాజాగా బీజేపీతో పొత్తు విషయమై మరోసారి ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తాము అడిగినన్ని సీట్లు కేటాయిస్తేనే టీడీపీ, జనసేన కూటమితో పొత్తుకు ఒకే చెప్తామని బీజేపీ పెద్దలు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ 13ఎంపీ సీట్లను అడుగుతుండగా చంద్రబాబు 4లేదా 5ఎంపీ సీట్లు కేటాయించటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ :- తెలంగాణని హెల్త్ డిస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం: ఆరోగ్య శాక మంత్రి

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న అంశాన్ని అమిత్ షా చంద్రబాబుకు గుర్తు చేశారట. ఇందులో భాగంగా 2014లో కేటాయించినట్లు తమకు 13సీట్లు కేటాయించాలని అన్నారట. కానీ పక్షంలో మధ్యే మార్గంగా 8 ఎంపీ స్థానాలైన కేటాయించాలని నడ్డా అన్నారట. మొత్తానికి డైలీ సీరియల్ లా సాగుతున్న బీజేపీతో పొత్తు ఎపిసోడ్ ఎప్పటికి తెగుతుందో చూడాలి.