రఘురామ ఎఫెక్ట్: పశ్చిమ గోదావరిలో చంద్రబాబుకు నిరసన సెగ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు ఉండి నుండి టికెట్ కేటాయించటంతో టీడీపీలో అసమ్మతి సెగ రగిలింది. తనను కాదని రఘురామకు టికెట్ కేటాయించటంపై సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకొని నిరసన తెలియజేసారు టీడీపీ కార్యకర్తలు.మంతెన రామరాజుకే టికెట్ కేటాయించాలని ఆందోళనకు దిగారు. రఘురామకు టికెట్ ఇవ్వటాన్ని సహించేది లేదని మండిపడ్డారు.మంతెన రామరాజును చంద్రబాబు నిండా ముంచారని అంటున్నారు ఆయన అనుచరులు.

శుక్రవారం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన రఘురామకు 24గంటలు కూడా గడవక ముందే టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకొని ఉన్న మంతెనకు తీవ్ర అన్యాయం చేసారని మండిపడుతున్నారు కార్యకర్తలు.టీడీపీ నాయకులకు కాకుండా తన సొంత మనుషులకు,జనసేన, బీజేపీ నాయకులకే చంద్రబాబు టికెట్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. రఘురామకు టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే నిరసన సెగ రాజుకున్న నేపథ్యంలో చంద్రబాబు పునరాలోచిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.