కట్టెలతో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు

కట్టెలతో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు

కర్నూలు: టీడీపీ, వైసీపీ వర్గాలు బాహా బాహీకి దిగాయి. పట్టుడు కర్రలతో పరస్పరం దాడి  చేసుకున్నాయి. అరుపులు… కేకలతో కొద్దిసేపు రణరంగంగా మారిన ఘర్షణలో నలుగురి తలలు పగిలాయి. రక్తం కారిపోతుంటే రోడ్డుపక్కన పడిపోయారు. ఇంతలో పోలీసులు రావడంతో ఘర్షణకు బ్రేక్ పడింది. పాక్షికంగా గాయపడిన ఇరువర్గాలకు చెందిన మరికొందరు పరారయ్యారు. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో జరిగిన సంఘటన ఉద్రిక్తత సృష్టించింది. ఫ్యాక్షన్ కు దూరంగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణ  ఉలిక్కిపడేలా చేసింది. 14 ఎకరాల దేవుని మాన్యం భూమి మేం సాగు చేసుకుంటామంటే.. మేమంటూ ఇరువర్గాల వాగ్వాదం చేసుకున్నారు. మాటా మాటా పెరిగి చివరకు కర్రలతో కొట్టుకున్నారు. గాయపడిన నలుగురు తమ కార్యకర్తలను కోడుమూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడుమూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.