మోడీ స్పీచ్ తో డీలా పడ్డ టీడీపీ అండ్ కో

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాగళం సభ ముగిసింది. మూడు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అవ్వలేదని టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోడీ స్పీచ్ ఇందుకు కారణమని తెలుస్తోంది. చిలకలూరిపేటలో జరిగిన ఈ సభలో ప్రధాని మోడీ రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం ఇవ్వబోయే వరాల గురించి ప్రస్తావిస్తాడని, జగన్ సర్కార్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తాడని భావించారు టీడీపీ శ్రేణులు. అయితే, మోడీ స్పీచ్ ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. మోడీ ప్రసంగంలో ఏక్కడ కూడా జగన్ గురించి ప్రస్తావన కానీ, విమర్శలు కానీ చేయలేదు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తమ స్పీచ్ లలో మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని, రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే అని అన్నారు. మోడీ మాత్రం ఎక్కడా జగన్ ప్రస్తావన కానీ, జగన్ సర్కార్ మీద విమర్శలు కానీ చేయలేదు. అంతే కాకుండా చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని అనలేదు. అమరావతి గురించి కూడా ప్రస్తావించలేదు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు పూర్తిగా నిరుత్సాహ పడుతున్నారు. ప్రజాగళం సభ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని నిరాశలో ఉన్నారు.