అమెరికా క్రికెటర్‌‌‌‌ నితీశ్‌‌‌‌కు టీడీసీఏ సన్మానం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యూఎస్ఏ అండర్‌‌‌‌‌‌‌‌–19 మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ , తెలుగు సంతతి క్రికెటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌ సుదిని నితీశ్ రెడ్డిని  తెలంగాణ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్‌‌‌‌ (టీటీసీఏ) ఘనంగా సన్మానించి అభినందించింది. నాగర్ కర్నూల్ జిల్లాకి చెందిన నితీశ్‌‌‌‌ రెడ్డి తల్లిదండ్రులు అమెరికాలో సెటిలయ్యారు. నితీశ్ కొంతకాలంగా బొడుప్పల్ రాంపల్లిలోని అశ్విన్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్‌‌‌‌ చేస్తున్నాడు. సోమవారం  అకాడమీకి వెళ్లిన టీటీసీఏ ప్రెసిడెంట్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా టీడీసీఏ కన్వీనర్‌‌‌‌ సురేందర్‌‌‌‌ రెడ్డి నితీశ్‌‌‌‌ను సన్మానించారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లాకు చెందిన కుటుంబం నుంచి ఓ ఆటగాడు అమెరికా క్రికెట్‌‌‌‌ జట్టులో ఆడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.