క్రిప్టో కరెన్సీ లావాదేవీల రూపంలో వచ్చే లాభాలపై పన్ను వేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.క్రిప్టో కరెన్సీల అంశంపై శుక్రవారం రాజ్యసభలో మాట్లాడారు సీతారామన్ . క్రిప్టో కరెన్సీలపై పన్ను విధించినందున దీని చట్టబద్ధతపై మంత్రికి సభ్యుల నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. పన్ను విధించినంత మాత్రాన ప్రభుత్వం చట్టబద్ధం చేస్తుందనుకోవద్దని చెప్పారు. ఈ దశలో క్రిప్టో కరెన్సీలను చట్టబద్దం చేయడం లేదు.. అలాగని నిషేధించడం లేదని తెలిపారు. సంప్రదింపుల తర్వాత నిషేధించడమా లేక నిషేధించకపోవడమా తేలుతుందన్నారన్నారు.
క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై వచ్చే లాభం నుంచి 30 శాతం పన్ను చెల్లించాలని కేంద్ర బడ్జెట్ 2022-23లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదన చేర్చారు. క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఉంటుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటికి ఎటువంటి అంతర్గత విలువ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు.
మరిన్ని వార్తల కోసం..
