టాటూలు వేయించుకుంటున్నారా... ప్రమాదాలున్నాయి.. జాగ్రత్త మరి

ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త కల్చర్​ వెంపట జనాలు పరుగులు పెడుతున్నారు.  టాటూ కల్చర్​ జనాలను అనారోగ్య బారిన పడేస్తుంది.  ఇది తెలియక చేతులు అందంగా.. కొత్త కొత్త రంగులు.. బొమ్మలతో కనపడాలని జనాలు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్యాషన్​ కల్చర్​ వల్ల అందం. ఎలా ఉన్నా.. అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అసలు టాలూల వల్ల ఇబ్బందులేమిటో తెలుసుకుందాం. . . 

ప్యాషన్​ యుగం పుంతలు తొక్కుతుంది.  బాడీపై ఎక్కడపడితే అక్కడ టాటూలు వేయించుకోవడం యూత్​ కు ప్యాషన్​ అయిపోయింది.  ఇది ఆరోగ్యంగా ఎంత వరకు కరక్ట్​ అని కూడా చూడడంలేదు.  శరీరంపై నచ్చిన బొమ్మలున్నాయా లేదా.. అవి ఎంత అందంగా ఉన్నాయి అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు యూత్​.   హైటెక్​ యుగంలో టాటూ కల్చర్​ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాల వలన తెలుస్తోంది.  

చర్మం కాస్త అందంగా ఉంటే చాలు దానిపై రక రకాల బొమ్మలను వేయించుకుంటారు.. అవేనండి యూత్​ కల్చర్​ లో టాటూలండి.  చాలా మంది చేతులపై... భుజాలపై వేయించుకుంటారు.  అయితే ఈ టాటూల వలన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో  న్యూయార్క్‌లోని బింగ్‌హామ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.  ఇప్పుడు అమెరికాలో చలామణిలో ఉన్న తొమ్మిది టాటూ ఇంక్ బ్రాండ్లను ల్యాబ్​ లో పరిశీలించారు.  వీటిలో బయటకు కనపడని 45 రకాల రసాయనాలు కలసి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టాటూల్లోని రసాయనాలు దీర్ఘకాలంలో ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి. అవి చర్మం ద్వారా శరీరంలోకి ఇంకుతాయి. శరీరం నుంచి ఇతర అవయవాలకు కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు టాటూలకు దూరంగా ఉండటమే మంచిది.

టాటూల వల్ల చర్మంలోని చెమట గ్రంథులకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. చెమట గ్రంథులు శరీరాన్ని చల్లబరచడం కోసం చెమటను ఉత్పత్తి చేసి బయటకి పంపిస్తాయి. దీనివల్ల మన శరీరంలో తగినంత ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అయితే టాటూలు వేయించుకున్న చోట చెమట గ్రంథులు సరిగా పనిచేయవు. పచ్చబొట్టు ఉన్న ప్రాంతంలో ఒకలా, పచ్చబొట్టు లేని ప్రాంతంలో ఒకలా చెమట గ్రంధులు పనిచేస్తాయి.

 టాటూలు వేసేందుకు వాడే ఇంకులోపాలిథిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉంటుందని.. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుందని  నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​సంస్థ తెలిపింది. ఇదే కాకుండా  2-ఫినాక్సిథెనాల్ అనే ప్రమాదకరమైన  రసాయన పదార్దం కొన్ని టాటూల్లో ఉంటుంది. ఈ రసాయనం చర్మంలో ఇంకితే ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయ సమస్యలతో పాటు మూత్రపిండాలకు నరాలకు హాని కలుగుతుంది పరిశోధక బృందం వెల్లడించింది.