ఈవీగా టాటా నెక్సాన్

ఈవీగా టాటా నెక్సాన్

టాటా మోటర్స్  తమ మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ నెక్సాన్ ఈవీని గురువారం ప్రవేశపెట్టింది.  ఎస్‌‌‌‌యూవీ నెక్సాన్ జిప్‌‌‌‌ట్రాన్ టెక్నాలజీతో వస్తున్న మొదటి ఈవీ కావడం విశేషం. ఈ వెహికిల్‌‌‌‌ను ఒకసారి చార్జ్ చేస్తే 300 కి.మీ వస్తుందని, 9.9 సెకెండ్లలోనే 100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. బుకింగ్స్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. కమర్షియల్ లాంచ్​ఇంకొన్ని వారాల్లో ఉంటుంది. ఈ ఈవీ మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. కంపెనీ దీనిపై ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కి.మీ వారంటీని అందిస్తోంది. ఇది ఆటో ఇండస్ట్రీలో అధికం. ఫాస్ట్ చార్జింగ్ మోడ్‌‌‌‌తో  80 శాతం చార్జీంగ్‌‌‌‌ను 10 నిమిషాల్లోనే చార్జ్ చేసుకోవచ్చు.