టాటా మోటార్స్ నుంచి బంపర్ ఆఫర్లు

టాటా మోటార్స్ నుంచి బంపర్ ఆఫర్లు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కస్టమర్లను ఆఫర్లతో ముంచెత్తుతోంది. అమ్మకాలను పెంచేందుకు టాటా డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పలు మోడల్స్ కు భారీ తగ్గింపులను ఇస్తున్నాయి. నెక్సాన్,  టిగోర్ మొదలుకొని  సఫారీ వంటి ఎస్​యూవీల వరకు చాలా మోడల్​పై డీల్స్ ఉన్నాయని టాటా ప్రకటించింది.  టాటా ఆల్ట్రూజ్ కొనుగోలుపై రూ. 10వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఆల్ట్రూజ్ డీజిల్ వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 10 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. పెట్రోల్ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 7,500 విలువైన డిస్కౌంట్​ పొందవచ్చు. టాటా సఫారీపై 2021 మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 60వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, డిస్కౌంట్  పొందవచ్చు. అయితే 2022 మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 40వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తారు. 2021 టాటా హారియర్ మోడల్​కు రూ. 25వేల వరకు విలువైన కార్పొరేట్ డిస్కౌంట్​ ఇస్తున్నారు. 2021 మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 60వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. 2022 మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 40వేల ఎక్స్ఛేంజ్​ బోనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తారు.  టిగోర్,  టియాగోపై వరుసగా రూ. 10వేల  రూ. 5వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. ఇతర రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు.  టాటా  నెక్సాన్ హ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డీజిల్ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కారును మార్చుకుంటే రూ. 15 వేల వరకు బోనస్ పొందవచ్చు. పెట్రోల్,  డీజిల్ వేరియంట్లపై వరుసగా రూ. 5వేల  రూ. 10వేల విలువైన కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.