- డిసెంబర్ సేల్స్‌లో హ్యుండయ్‌ను క్రాస్ చేసి రెండో ప్లేస్‌కు
- అత్యధిక మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ సేల్స్..
బిజినెస్ డెస్క్, వెలుగు: కార్ల అమ్మకాల్లో దక్షిణ కొరియా కంపెనీ హ్యుండయ్‌ను టాటా మోటార్స్ అధిగమించింది. కంపెనీ డిసెంబర్ సేల్స్ 50 శాతం పెరిగాయి. దీంతో ఈ నెల కార్ల అమ్మకాల్లో రెండో ప్లేస్‌ను టాటా మోటార్స్ దక్కించుకుంది. కంపెనీ మరికొన్ని రికార్డ్‌లను కూడా నమోదు చేసింది. ప్యాసెంజర్ వెహికల్స్ (పీవీ) బిజినెస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తే, ఈ సారి అత్యధిక నెలవారీ, క్వార్టర్లీ, ఇయర్లీ సేల్స్‌ను టాటా మోటార్స్ రికార్డ్ చేసింది. లోకల్ మార్కెట్‌లో కిందటి నెలలో 32,312 కార్లను హ్యుండయ్ సేల్ చేయగా, 35,300 కార్లను టాటా మోటార్స్ అమ్మింది. డిసెంబర్‌లో 1,53,149 కార్లను అమ్మి మారుతి సుజుకీ మొదటి ప్లేస్‌లో ఉంది. డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో మొత్తం 99 వేల కార్లను టాటా మోటార్స్ సేల్ చేయగా, మొత్తం ఏడాదిలో 3.31 లక్షల వెహికల్స్‌ను అమ్మగలిగింది.
చిప్‌ల కొరత ఉన్నా..
సెమికండక్టర్ల కొరత ఉన్నప్పటికీ డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్ అనేక మైలురాళ్లను అందుకుందని టాటా మోటార్స్ పీవీ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేషన్ చంద్ర అన్నారు. ‘డిసెంబర్ క్వార్టర్‌లో 99,002 యూనిట్ల సేల్స్‌తో (డిసెంబర్,2020 క్వార్టర్ కంటే 44 % ఎక్కువ), డిసెంబర్‌లో 35,299 యూనిట్ల సేల్స్‌తో (డిసెంబర్, 2020 సేల్స్‌తో పోలిస్తే 50 % అప్) ఈసారి గత పదేళ్లలోనే అత్యధిక క్వార్టర్లీ, మంత్లీ సేల్స్‌ను రికార్డ్ చేశాం. దీనికి అదనంగా మొత్తం 2021 లో 3,31,178 యూనిట్లను అమ్మగలిగాం. ప్యాసెంజర్ బిజినెస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంతలా సేల్స్ జరగడం ఇదే మొదటిసారి. అక్టోబర్, 2021 లో లాంచ్ చేసిన టాటా పంచ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండడం కూడా సేల్స్ పెరగడానికి కారణమయ్యింది’ అని చంద్ర అన్నారు. చిప్‌ల షార్టేజ్ వలన హ్యుండయ్ మోటార్స్ సేల్స్ మాత్రం తగ్గిపోయాయి.
టాటా ఈవీల సేల్స్ పైకి..
టాటా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కూడా ఈ సారి పెరిగాయి. కంపెనీ మొదటిసారిగా 2 వేల ఈవీ యూనిట్ల సేల్స్ మార్క్‌ను డిసెంబర్‌లో టచ్ చేసింది. డిసెంబర్‌లో 2,255 ఎలక్ట్రిక్ కార్లను అమ్మగలిగింది. డిసెంబర్ క్వార్టర్‌ను పరిగణనలోకి తీసుకుంటే 5,592 ఈవీలను టాటా మోటార్స్ అమ్మింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 10 వేల ఈవీలను కంపెనీ సేల్ చేసింది.
మిగిలిన కంపెనీల డిసెంబర్ సేల్స్..
1) మారుతి సుజుకీ ఈ డిసెంబర్‌లో మొత్తం 1,53,149 యూనిట్లను (డొమెస్టిక్, ఎక్స్‌పోర్ట్స్) సేల్ చేసింది. డిసెంబర్, 2020 లో అమ్ముడైన 1,60,226 యూనిట్లతో పోలిస్తే ఈ సేల్స్ 4 శాతం తక్కువ.
2) హ్యుండయ్ ఇండియా కిందటి నెలలో మొత్తం 48,933 వెహికల్స్‌ను అమ్మింది. ఇందులో 32,312 యూనిట్లను దేశీయ మార్కెట్‌లో సేల్ చేసింది. మొత్తం ఏడాదిని చూస్తే, కంపెనీ సేల్స్ 6,35,413 యూనిట్లకు పెరిగాయి. ఇది అంతకు ముందు ఏడాది అమ్మిన 5,22,542 యూనిట్లతో పోలిస్తే 21.6 శాతం ఎక్కువ.
3) హోండా కార్స్ కిందటి నెలలో 7,973 కార్లను లోకల్ మార్కెట్‌లో అమ్మింది. 2020 డిసెంబర్‌లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ సారి కంపెనీ సేల్స్ 8 శాతం తగ్గాయి. మొత్తం ఏడాదిలో డొమెస్టిక్‌గా 89,152 కార్లను కంపెనీ అమ్మింది. 2020 లో ఈ సేల్స్ 70,593 వెహికల్స్‌గా ఉన్నాయి.
4) ఎంజీ మోటార్ కిందటేడాది 40,273 కార్లను అమ్మగలిగింది. 2020 లో సేల్ అయిన 28,162 యూనిట్లతో పోలిస్తే కిందటేడాది కంపెనీ అమ్మకాలు 43 శాతం పెరిగాయి.
6) స్కోడా అమ్మకాలు 2021 లో రెండింతలు పెరిగి 23,858 యూనిట్లకు ఎగిశాయి. 2020 లో 10,387 వెహికల్స్‌ను కంపెనీ అమ్మింది.
7) మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ డిసెంబర్‌లో 39,157 యూనిట్లకు పెరిగాయి. ఇందులో 17,722 వెహికల్స్‌ను దేశీయ మార్కెట్‌లో సేల్ చేసింది.
