అల్లాదుర్గం, వెలుగు: అల్లాదుర్గం సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీళ్లు వచ్చాయని వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి కి చెందిన రాజు తన బైక్‌లో అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద నేషనల్ హైవే 161 పక్కన ఉన్న ఇండియన్ అయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని వెళ్లిపోయాడు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాక బైక్ సడన్‌గా ఆగిపోవడంతో సమీపంలో ఉన్న మెకానిక్ ని పిలిపించి చూయించాడు.
ట్యాంక్‌లో పెట్రోల్ ను బాటిల్లో నింపగా అందులో పెట్రోల్ లో నీళ్లు కలిసినట్టు తేలడంతో ఆ యువకుడు కంగు తిన్నాడు. సదరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కు వెళ్లి నిర్వహకులను నిలదీసి అడగ్గా తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. కల్తీ పెట్రోల్విక్రయిస్తున్న సదరు బంక్ మీద చర్యలు తీసుకోవాలని బాధితుడు రాజు తహసీల్దార్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.