చెన్నై: కార్మికులకు ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో రోజువారీ పనివేళలను 12 గంటలకు పెంచి, పనిదినాలను 4 రోజులకు తగ్గిస్తూ తీసుకొచ్చిన ఫ్యాక్టరీల(సవరణ) చట్టం 2023ని ఉపసంహరించుకున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం వెల్లడించారు. మే డే సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. “తప్పును సరిదిద్దుకోవడాన్ని నేను ఎప్పుడూ అవమానంగా భావించలేదు. చట్టాన్ని రూపొందిండమే కాదు..దాన్ని ఉపసంహరించుకోవడానికి కూడా ధైర్యం అవసరం. కలైంజ్ఞర్(మాజీ సీఎం కరుణానిధి) మాకు అలా శిక్షణ ఇచ్చారు. కార్మిక సంఘాలు అభ్యంతరం తెలిపిన ఫ్యాక్టరీల సవరణ చట్టాన్ని 2 రోజుల్లోనే వాపస్ తీసుకున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల సంక్షేమం విషయంలో రాజీపడం. రాష్ట్రంలో పరిశ్రమలు పెరగాలి, కార్మికులు అభివృద్ధి చెందాలనేదే మా ఉద్దేశం" అని సీఎం స్టాలిన్ అన్నారు.
