వండర్ మ్యాన్ : కంప్యూటర్ కంటే స్పీడ్.. రెప్ప పాటులో రైల్వే టికెట్ బుకింగ్

వండర్ మ్యాన్ : కంప్యూటర్ కంటే స్పీడ్.. రెప్ప పాటులో రైల్వే టికెట్ బుకింగ్

తమిళనాడులో ఓ వండర్ జరిగింది.  రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర చాలా క్యూ ఉంది.  దీంతో ఓ ప్రయాాణికుడు ATVM దగ్గరకు వెళ్లగా అక్కడున్న ఆపరేటర్ టికెట్ ఇచ్చిన తీరును చూసి షాక్ అయ్యాడు.  కేవలం మూడు సెకన్ల వ్యవధిలో టికెట్ ఇచ్చి ఔరా అనిపించుకున్నాడు.రైలు టికెట్ (train ticket) అనగానే అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. మనదేశంలో రైలు టికెట్ దొరకడం రానురాను అంత కష్టమైన పనిగా మారుతోంది. ఎప్పుడు చూసినా రైళ్లు ఫుల్, టికెట్లు నిల్ (tickets nill) అన్నట్టు సాగుతోంది ఈ తంతు అంతా. ఇక పండుగలు (festive season), పెళ్లిళ్ల సీజన్ (marriage season), సెలవుల సమయంలో (vacations time) అయితే 3 నెలల ముందే టికెట్లు అయిపోతాయి.

ఇక తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే  రైల్వే స్టేషన్లో క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలంటే నరకయాతన పడాలి.  చాంతాడంత క్యూలో నిలబడి టికెట్ తీసుకొనే సమయానికి ట్రైన్ కూడా కదిలే అవకాశం ఉంది. టికెట్ల క్యూ రద్దీని తగ్గించేందుకు  రైల్వేశాఖ యం ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషిన్ (ATVM)  వ్యవస్థను ప్రవేశపెట్టింది.  అయితే ఆ మిషన్ ను  ఒకరు  ఆపరేట్ చేస్తుంటారు.  అయితే తమిళనాడులో ఆమిషన్ దగ్గర ఉన్న వ్యక్తి మూడు సెకన్లలోనే టికెట్ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది. 

ఈ వీడియోలో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ (ATVM)ని ఆపరేట్ చేసే వ్యక్తి తన వేళ్లతో టచ్ ప్యాడ్ ను ఆడుకున్నాడు.  ఆయన వేళ్లు ఎంత వేగంగా కదిలాయంటే కనురెప్ప వేసే సమయంలో ప్రయాణికులకు టికెట్ ఇచ్చాడు.  కేవలం మూడు సెకన్ల వ్యవధిలో టికెట్ ఇచ్చి .. నెక్స్ట్ అని పిలుస్తున్నట్టు స్పష్టంగా ఉంది.  ఈ వీడియోను anbukowsi123  అనే ఇన్‌స్టాగ్రామ్  అకౌంట్ నుంచి  తమిళనాడులో అత్యంత వేగవంతమైన రైలు బుకింగ్ కౌంటర్ క్యాప్షన్ తో  సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.  ఇప్పటి వరకు (వార్త రాసే సమయం వరకు ) ఈ వీడియోకు 2 లక్షలకు పైగా లైక్‌లు రాగా.. వేలాది మంది షేర్ చేశారు.