భారత్ లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తమిళనాడులో నూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34 కు చేరింది. ఒక్కరోజులోనే ఈ స్థాయిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది.
ఒమిక్రాన్ సోకిన వారిలో 30 మంది విదేశాల నుంచి రాగా, ఒకరు కేరళ నుంచి వచ్చారు... మరో ఇద్దరు తమిళనాడులోనే ఒమిక్రాన్ బారినపడినట్టు తెలుస్తోంది. 33 మందిలో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు.
కొత్తగా నమోదైన కేసుల్లో పెద్దగా లక్షణాలతో బాధపడుతున్నవారు లేరని.. ఒకరిద్దరిలో మాత్రం స్వల్పంగా గొంతునొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపించాయని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. మరో 23 మంది జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టు రావాల్సి ఉందని వైద్యాధికారులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..
