రైతు రుణమాఫీ ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

రైతు రుణమాఫీ ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించింది. రైతు రుణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.  మొత్తం 12,100 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 16,43 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో సీఎం పళనిస్వామి ప్రభుత్వం పలు పథకాలకు శ్రీకారం చుడుతోంది.ఇందులో భాగంగానే రైతు రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాదు ఈ పథకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు.