అరుణతోనే పాలమూరు ప్రగతి

  •     తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై 

పాలమూరు, వెలుగు : పాలమూరు ప్రగతి సాధించాలంటే బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ తమిళనాడు చీఫ్​అన్నామలై అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద జరిగిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు. అరుణమ్మ గెలిస్తే కేంద్రమంత్రి అవుతారని చెప్పారు. జిల్లాలోని కోయిల్ సాగర్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు పూర్తయ్యాయంటే అరుణ‌‌‌‌‌‌‌‌ పోరాట ఫ‌‌‌‌‌‌‌‌లిత‌‌‌‌‌‌‌‌మేనన్నారు.

పాలమూరులో కాంగ్రెస్ కు ఓట‌‌‌‌‌‌‌‌మి భయం పట్టుకుందని, అందుకే పదే పదే సీఎం రేవంత్​రెడ్డి ఈ నియోజ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్గానికే వ‌‌‌‌‌‌‌‌చ్చారన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేసి బీజేపీకి మద్దతుగా నిల‌‌‌‌‌‌‌‌వాలని కోరారు.