అంబేద్కర్ పేరెత్తితే అలర్జీ వస్తుందనుకుంటా.. అమిత్ షాకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్..

పార్లమెంట్ లో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్నాయి.  ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అటు దేశ వ్యాప్తంగాఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తమిళ నటుడు , తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ అమిత్ షాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 

 కొంతమందికి అంబేద్కర్  పేరు అంటే ఎలర్జీ అనుకుంటా..ఆయన పేరు నచ్చదు కావొచ్చు అని అమిత్ షా నుద్దేశించి అన్నారు విజయ్. అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తినిచ్చే.. సాటిలేని రాజకీయ  మేధావి  అని కొనియాడారు. అంబేద్కర్ వారసత్వం అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి .., సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతిఘటనకు ప్రతీక అని అన్నారు.  అంబేద్కర్ .. అంబేద్కర్ .. అంబేద్కర్ ... అని మన పెదవులపై ఆనందంతో నిత్యం ఆయన  నామాన్ని జపించుదామని విజయ్ అన్నారు.

 డిసెంబర్ 17న పార్లమెంట్ లో మాట్లాడిన అమిత్ షా.. అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు ఉందని..  ప్రతిపక్షాలు తరచూ దేవుడి పేరు పెట్టుకుని ఉంటే స్వర్గానికి చేరుకునేవారని కేంద్ర హోంమంత్రి షా అన్నారు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.  అంబేద్కర్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించాయి. 

Also Read:-అమిత్ షా రిజైన్​ చేయాలి .. అంబేద్కర్​ను అవమానించడాన్ని ఖండిస్తున్నం..

ఉత్తర తమిళనాడులోని విక్రవాండిలో తన పార్టీ మొదటి ర్యాలీ సందర్భంగా TVK  సైద్ధాంతిక గురువులలో అంబేద్కర్‌ను విజయ్ చెప్పిన సంగతి తెలిసిందే.. ఈ ప్రాంతం గణనీయమైన దళిత జనాభాను కలిగి ఉందని.. విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) అధ్యక్షుడు థోల్  బలమైన కోటగా పరిగణించబడుతుంది. తిరుమావళవన్ స్థాపించిన VCKని గతంలో దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారని విజయ్ తెలిపారు.

யாரோ சிலருக்கு வேண்டுமானால் அம்பேத்கர் பெயர் ஒவ்வாமையாக இருக்கலாம். சுதந்திரக் காற்றை சுவாசிக்கும் இந்திய மக்கள் அனைவருக்கும் அவர்கள் உயரத்தில் வைத்துப் போற்றும் ஒப்பற்ற அரசியல் மற்றும் அறிவுலக ஆளுமை, அவர்.

அம்பேத்கர்...
அம்பேத்கர்... அம்பேத்கர்...
அவர் பெயரை
உள்ளமும் உதடுகளும்…

— TVK Vijay (@tvkvijayhq) December 18, 2024