ఎల్ఏసీ వెంట ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనాతో జరిపిన చర్చల్లో ఎలాంటి పరిష్కారం దొరకలేదన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. తూర్పు లఢఖ్ లోని సరిహద్దు వెంట ప్రస్తుతం స్టేటస్ కొనసాగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో LAC వెంట బలగాలను తగ్గించలేమన్నారు. ఆర్మీ, విదేశాంగ శాఖ అధికారులు చైనాతో ఇప్పటికే చర్చలు జరిపారని గుర్తు చేశారు. త్వరలోనే మరోసారి చర్చలు జరుగుతాయన్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ఏ దేశం ప్రయత్నించినా అడ్డుకునే సామర్థ్యం ఇండియాకు ఉందన్నారు రాజ్ నాథ్ . అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలనే భారత్ కోరుకుంటోందని స్పష్టం చేశారు.
If there is status quo, it is natural how deployment can be reduced. There will be no reduction in our deployment and I feel their deployment will also not reduce. Our expectation is that talks result in a positive outcome: Defence Minister Rajnath Singh on India-China standoff https://t.co/AARZh2GMId
— ANI (@ANI) December 30, 2020
