పురస్కారాలతో ప్రతిభకు వన్నె

వనపర్తి టౌన్, వెలుగు: పురస్కారాలు ప్రతిభావంతుల ప్రతిభకు వన్నె తెస్తాయని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్  పేర్కొన్నారు.  ఇటీవల డాక్టరేట్  పురస్కారం అందుకున్న  వనపర్తికి చెందిన గోకుల అనంతప్ప, గాలిముడి రాములును ఆదివారం సాహితీ కళా వేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు. గ్లోబల్  హ్యూమన్  రైట్స్  ట్రస్ట్  ఇంటర్నేషనల్  ఆర్గనైజేషన్  హైదరాబాద్  ఆధ్వర్యంలో వీరిద్దరికీ ఇటీవల గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా, గణితావధానిగా అనంతప్ప ప్రతిభ కనబర్చి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. సైకాలజిస్ట్ గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా డాక్టర్  రాములు విద్యారంగానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. అనంతరం వారిని శాలువా, మెమొంటోలతో సత్కరించారు. జనజ్వాల, బైరోజు చంద్రశేఖర్, ఎంఏ సత్తార్, కె గణేశ్ కుమార్, శ్రీనివాసులు, చిన్నమ్మ, థామస్  పాల్గొన్నారు.