హనుమాన్ ఆలయంలో ఘనంగా ముగిసిన తాళ సప్తమి వేడుకలు

  • ఏడు రోజులపాటు కొనసాగిన భజనలు, కీర్తనలు, అన్నదానం 

కుభీర్, వెలుగు: కుభీర్​మండలంలోని పార్డి(కె) గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో ఏడు రోజులుగా కొనసాగుతున్న తాళ సప్తమి వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. వేడుకల ముగింపు సందర్భంగా.. హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భాజాభజంత్రీల మధ్య దిండి ఊరేగింపు సాగింది. అనంతరం కాల కీర్తన కార్యక్రమం నిర్వహించారు. 

వేడుకలకు కుభీర్ మండలంతోపాటు మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా తాళ సప్తమి వేడుకలు ఏడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.