ఐసీసీ టీ20 ప్రపంచకప్ వేదిక తరలింపునకు రంగం సిద్ధమైంది. అక్టోబర్-నవంబర్‌లో జరిగే కప్‌ను యూఏఈ, ఒమన్‌లో నిర్వహించేందుకే ఐసీసీ మొగ్గు ఆసక్తి చూపుతోంది. టోర్నీ నిర్వహణపై అధికారికంగా BCCIకి నాలుగు వారాల గడువు ఇచ్చినా.. అనధికారికంగా విషయం చెప్పేసిందని తెలిసింది. బోర్డు కూడా ఇందుకు అంగీకరించిందనే అంటున్నారు.
ఒకవేళ ఐపీఎల్ అక్టోబర్ 10న ముగిసినా.. నవంబర్‌లో ప్రపంచకప్ యూఏఈ లెగ్ ఆరంభమవుతుంది. పిచ్‌లు సిద్ధం చేసేందుకు మూడు వారాల సమయం ఉంటుంది. అదే సమయంలో మొదటి వారం మ్యాచులు ఒమన్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
భారత్‌లో అక్టోబర్-నవంబర్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తుందని ఐసీసీ సభ్యులు భావిస్తున్నారట.
