హైదరాబాద్, వెలుగు: స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎనేబ్లర్ టీహబ్, దేశంలోని టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం ఇన్నోవేషన్లను, వెంచర్ పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడానికి హైదరాబాద్ ఏంజిల్స్‌తో చేతులు కలిపింది. హైదరాబాద్ ఏంజిల్స్ తన నెట్వర్క్ ద్వారా భారతదేశం, అమెరికా, యుకె, సింగపూర్, దుబాయ్ యుఎఇ నుండి స్టార్టప్‌లకు పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని టీహబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఎకో సిస్టమ్పార్ట్నర్లతో కలిసి పనిచేయడానికి హైదరాబాద్ ఏంజిల్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. "స్టార్టప్‌లకు టెక్నాలజీ, మెంటర్షిప్, ఫండింగ్ మార్గాలు, వారి ఇన్నోవేషన్ అజెండాలను వేగవంతం చేయడానికి అవసరమైన సాయం అందించడంలో ఈ పార్ట్నర్షిప్ కీలక పాత్ర పోషిస్తుంది" అని ఆయన చెప్పారు. హైదరాబాద్ ఏంజిల్స్ చైర్మన్ రాజేష్ మంతెన మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటి వరకు 60కి పైగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు.
