- సిర్మా ఐపీఓ సక్సెస్
- షేరు ధర 42 శాతం జంప్
న్యూఢిల్లీ: సిర్మా ఎస్‌జిఎస్ టెక్నాలజీ ఐపీఓ సూపర్‌హిట్ అయింది. దీని ఇష్యూ ధర రూ. 220 కాగా, శుక్రవారం తొలి ట్రేడింగ్‌లో షేర్లు 42 శాతానికి పైగా ప్రీమియంతో ముగిశాయి. బిఎస్‌ఇలో ఇష్యూ ధర నుంచి 19.09 శాతం ఎగబాకి 262 రూపాయల వద్ద ఈ షేరు మొదలయింది. తరువాత 42.90 శాతం పెరిగి రూ.314.40కి చేరుకుంది. చివరకు 42.29 శాతం లాభంతో రూ.313.05 వద్ద ముగిసింది. ఇదే షేరు ఎన్‌ఎస్‌ఈలో 18.18 శాతం ప్రీమియంతో రూ.260 వద్ద ప్రారంభమైంది. ఇష్యూ ధర కంటే 41.81 శాతం పెరిగి షేరు రూ.312 వద్ద స్థిరపడింది.
ట్రేడెడ్ వాల్యూమ్ పరంగా చూస్తే 54.77 లక్షల షేర్లు రోజులో బీఎస్ఈలో 5.99 కోట్ల షేర్లు ఎన్‌ఎస్‌ఈలో ట్రేడయ్యాయి. బిఎస్‌ఇలో కంపెనీ మార్కెట్ వాల్యూ రూ.5,516.85 కోట్లుగా ఉంది. సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) పోయిన వారం గురువారం 32.61 రెట్లు సబ్స్క్రయిబ్ అయింది. ఇష్యూ సైజు రూ.840 కోట్లు కాగా, ప్రైస్‌బ్యాండ్‌ను రూ.209–-220 రేంజ్‌లో ఉంది. సిర్మా ఎస్జీఎస్ టర్న్‌కీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్)లో టెక్నాలజీ- సెంట్రిక్ ఇంజనీరింగ్ డిజైన్ కంపెనీ.
టీవీఎస్ మోటార్ కంపెనీ, ఏఓ స్మిత్ ఇండియా వాటర్ ప్రొడక్ట్స్, రాబర్ట్ బాష్ ఇంజనీరింగ్ బిజినెస్ సొల్యూషన్, యురేకా ఫోర్బ్స్, టోటల్ పవర్ వంటివి దీని కస్టమర్లు. ఇదిలా ఉంటే సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం కొద్దిపాటి లాభాలతో ముగిశాయి.
