ఆ ఎఫ్ఐఆర్​ ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనం: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌‌‌‌ఐఆర్ కేంద్ర ప్రభుత్వ నిస్సహాయ స్థితికి నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. అంబేద్కర్‌‌‌‌ను అవమానించినందుకు అమిత్ షాపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. వాళ్ల దృష్టిని మళ్లించేందుకే  రాహుల్‌‌‌‌పై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.

అంబేద్కర్ పట్ల ఎన్డీయే ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలు చూసి బీజేపీ భయపడుతున్నదని వెల్లడించారు. శుక్రవారం లోక్‌‌‌‌సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వా త పార్లమెంటు ఆవరణలో ప్రియాంకా గాంధీ ఈ కామెంట్స్ చేశారు.