జొమాటోకు నిమిషానికి 6,600,స్విగ్గీకి 9,500 ఆర్డర్లు

 జొమాటోకు నిమిషానికి 6,600,స్విగ్గీకి 9,500 ఆర్డర్లు
  •     నాన్​వెజ్​ ఫుడ్​కే ఎక్కువ గిరాకీ
  •     సతాయించిన ఆన్‌‌లైన్‌‌ పేమెంట్​​ సిస్టమ్స్

న్యూఢిల్లీ:  మిషానికి 9,500 ఆర్డర్లు డెలివరీ ఇచ్చామని స్విగ్గీ సీఈఓ మాజేటి శ్రీహర్ష చెప్పారు. ‘‘గత ఏడాది డిసెంబరు 31న నిమిషానికి 5,500 ఆర్డర్లు అందించాం. రాత్రి తొమ్మిదింటిలోపు అందించిన ఆర్డర్ల సంఖ్య 20 లక్షలు దాటింది. మా గ్రాసరీ యాప్​ స్విగ్గీ ఇన్​స్టామార్ట్ ఆర్డర్లు సాధారణ రోజులతో పోలిస్తే శుక్రవారం 33 శాతం పెరిగాయి”అని ట్వీట్​ చేశారు. అయితే ఆర్డర్ల విలువను మాత్రం ఆయన వెల్లడించలేదు.  స్విగ్గీకి కొత్త కస్టమర్లు 80శాతం పెరిగారు.  చిన్న నగరాలైన మంగళూరు, పాట్నా, లూథియానా, సూరత్‌‌‌‌‌‌‌‌ నుంచి కొత్త కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.  బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై నుంచి అత్యధికంగా ఆర్డర్లు వచ్చాయి. టైర్ 2&3 నగరాల్లో, వైజాగ్‌‌‌‌లో నిమిషానికి  190 ఆర్డర్లు వచ్చాయి. రూర్కెలా, పాలక్కాడ్ వంటి నగరాల్లో ఆర్డర్లు 300 శాతం పెరిగాయి. డిసెంబరు–జనవరి నెలల్లో కష్టపడ్డ తమ డెలివరీ పార్ట్​నర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్స్​ అందించినట్లు స్విగ్గీ తెలిపింది. చికెన్ బిర్యానీ, బటర్ నాన్, పనీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, తందూరి చికెన్,  గార్లిక్ బ్రెడ్ స్టిక్స్​కు ఎక్కువ గిరాకీ కనిపించిందని ఈ రెండు యూనికార్న్​ స్టార్టప్​లు తెలిపాయి. స్విగ్గీ తాజాగా 700 మిలియన్ డాలర్లను సేకరించింది.

స్నాక్స్‌‌, కండోమ్​ల కోసం భారీగా ఆర్డర్లు: ఫుడ్​తోపాటు ఆన్‌‌‌‌లైన్ డెలివరీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకు స్నాక్స్, డ్రింక్స్,  కండోమ్‌‌‌‌ల కోసం భారీ ఆర్డర్లు వచ్చాయి. ఆన్‌‌‌‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ బ్లింకిట్‌‌‌‌ (గతంలో గ్రోఫర్స్​) లో  కండోమ్‌‌ల కోసం 33,440  ఆర్డర్లు వచ్చాయని దీపిందర్ గోయల్ ట్వీట్‌‌‌‌ చేశారు. దేశవ్యాప్తంగా 1.3 లక్షల లీటర్ల సోడా, 43,000 క్యాన్ల ఎరేటెడ్ డ్రింక్స్, 7,000 ప్యాకెట్ల నాచోస్ చిప్స్​, 4,884 డిప్స్, 6,712 టబ్‌‌‌‌ల ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లు,  28,240 ప్యాక్‌‌‌‌ల ఇన్‌‌‌‌స్టంట్ పాప్‌‌‌‌కార్న్​లను డెలివరీ చేశామని చెప్పారు.  కొవిడ్​ టెస్టులకు వాడే కోవిసెల్ఫ్​ కిట్‌‌‌‌లు 10 వేలకుపైగా డెలివరీ అయ్యాయి. 11,943 ఐస్ ప్యాక్‌‌‌‌లకు కూడా ఆర్డర్లు వచ్చాయి.  సాధారణంగా బ్లింకిట్‌‌కు రెండు వారాల్లో వచ్చే ఆర్డర్లు కేవలం శుక్రవారం ఒకే రోజు వచ్చాయని గోయల్​ చెప్పారు. మరోవైపు ఆన్​లైన్​లో ఆర్డర్లు వెల్లువెత్తడంతో యూపీఐ వంటి పేమెంట్ సిస్టమ్స్​ పనిచేయలేదు. కొన్ని బ్యాంకుల యాప్స్​ కూడా మొరాయించాయి. క్యూఆర్​ కోడ్​ స్కానింగ్​ద్వారా డబ్బు చెల్లించడం ఇబ్బందిగా మారింది.