విధుల్లో అలసత్వం.. పెబ్బేరు కానిస్టేబుల్​ సస్పెన్షన్

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో పని చేస్తున్న కానిస్టేబుల్  రాజేంద్రప్రసాద్ పై సస్పెన్షన్  వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించాడనే కారణంతో సస్పెండ్​ చేస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్  శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

వనపర్తి పట్టణంలో ట్రాఫిక్  డ్యూటీకి వెళ్లాలని ఎస్ఐ హరిప్రసాద్​రెడ్డి సూచించగా, ట్రాఫిక్  డ్యూటీ చేయనంటూ ఎస్ఐతో గొడవ పడి, ఆయన వ్యక్తిగత లాప్ టాప్​​ను పగలగొట్టాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఎస్ఐ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కొత్తకోట సీఐ రాంబాబు విచారణ జరిపి ఎస్పీకి నివేదిక ఇవ్వడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.