IND vs AUS: రాణించిన సూర్యవంశీ

చెన్నై: ఆస్ట్రేలియా అండర్‌‌‌‌‌‌‌‌–19  జట్టుతో తొలి అనధికారిక టెస్టును ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌–19 టీమ్ మెరుగ్గా ఆరంభించింది. సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌‌‌‌లో 13 ఏండ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (47 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 బ్యాటింగ్‌‌‌‌) ఫిఫ్టీకి తోడు, బౌలర్లు మహ్మద్ ఇనాన్‌‌‌‌ (3/48), సమర్థ్‌‌‌‌ నాగరాజ్‌‌‌‌ (3/49) సత్తా చాటారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఆసీస్‌‌‌‌ 71.4 ఓవర్లలో  293 స్కోరుకే ఆలౌటైంది.  ఐడన్‌‌‌‌ ఒకొనో (61), రిలీ కింగ్‌‌‌‌సెల్‌‌‌‌ (53), క్రిస్టియన్ హోవె (48) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియా 14 ఓవర్లలో 103/0 స్కోరుతో తొలి రోజు ముగించింది. సూర్యవంశీతో పాటు విహాన్ మల్హోత్ర (21 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. కాగా, ఈ సిరీస్‌‌‌‌కు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్‌‌‌‌ గాయం కారణంగా తొలి మ్యాచ్‌‌కు దూరమయ్యాడు.