2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. తాము ఆశించిన చోట సీటు దక్కలేదని కొందరు, తమని కాదని తమకు గిట్టని వారికి సీటు ఇచ్చారని మరికొందరు రాజీనామా చేసి పక్క పార్టీలో చేరుతున్నారు. అన్ని పార్టీలకంటే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించిన అధికార వైసీపీలో ఈ ఫిరాయింపులు ఎక్కువగా ఉంటే, ఇటీవలే ఉమ్మడి జాబితా ప్రకటించిన టీడీపీ, జనసేన కూటమిలో కూడా ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి.
జనసేన పీఏసీ మెంబర్, సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ జనసేనకు రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు డిసైడ్ అయ్యారట.పొత్తులో భాగంగా జనసేనకు 24సీట్లు మాత్రమే కేటాయించటం, ఆ కేటాయించిన సీట్లలో కూడా జనసేన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటమే సూర్యప్రకాష్ రాజీనామాకు కారణమని తెలుస్తోంది.
కాగా, పవన్ కి ఇష్టం ఉన్నా లేకున్నా చివరి వరకు పవన్ వెంటే ఉంటానని హరిరామజోగయ్య రాసిన బహిరంగలేఖలో తెలిపిన కాసేపటికే సూర్యప్రకాష్ రాజీనామా అంటూ వార్త రావటం చర్చనీయాంశం అయ్యింది. మరి, టీడీపీ జనసేన జెండా సభ తర్వాత కాపు వర్గ నేతల నుండి వస్తున్న వ్యతిరేకతను పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.