IND vs SA 3rd T20I: తిలక్ నా స్థానం కావాలని అడిగాడు.. అందుకే త్యాగం చేశా: సూర్య

టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సౌతాఫ్రికాపై దుమ్మురేపాడు.సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో టీ20లో సెంచరీతో చెలరేగాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు బాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‎లో తొలి సెంచరీ నమోదు చేశాడు.  ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్ లో ఉన్న అతను 56 బంతుల్లో 107 పరుగులు చేసి నాటౌట్‎గా నిలిచాడు. మొదటి రెండు మ్యాచ్ ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ.. మూడో టీ20లో మాత్రం మూడో స్థానంలో ఆడాడు. దీనికి గల కారణమని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. 

మ్యాచ్ తర్వాత భారత్ విజయంపై మాట్లాడిన తిలక్ ఆ తర్వాత తిలక్ వర్మ సెంచరీ గురించి ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో తిలక్ వర్మను మూడో స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేశాడో తెలిపాడు " తిలక్ ను మూడో స్థానంలో పంపే నిర్ణయాన్ని ముందు రోజు నుంచే తీసుకున్నాను. గెబార్హ వేదికగా జరిగిన రెండో టీ20 ముగిసిన తర్వాత అతను (తిలక్) నా గదికి వచ్చి, 'నెం. 3లో బ్యాటింగ్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగాడు. మంగళవారం రాత్రి నేను తిలక్‌తో నువ్వు మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కి వెళ్తున్నావు" అని తిలక్ తో చెప్పినట్టు సూర్య తెలిపాడు. 

ALSO READ | AUS vs IND: భారత్‌కు పీడకల గుర్తు చేస్తున్న ఆసీస్ స్టార్ క్రికెటర్ భార్య

డర్బన్ లో జరిగిన తొలి టీ20లో ఈ హైదరాబాద్ కుర్రాడు 18 బంతుల్లో 33 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20లో 20 పరుగులే చేసి పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే బ్యాటింగ్‌‌‌‌తో తిలక్‌‌‌‌ వర్మ (56 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌‌‌‌లతో 107 నాటౌట్‌‌‌‌), అభిషేక్‌‌‌‌ శర్మ (25 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 50) మెరుపులకు తోడు అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (3/37) రన్స్‌‌‌‌ కట్టడి చేయడంతో.. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఇండియా 11 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. దీంతో నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 2–1 ఆధిక్యంలో నిలిచింది. 

టాస్‌‌‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 219/6  స్కోరు చేసింది. తర్వాత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 208/7  స్కోరు చేసింది. యాన్సెన్‌‌‌‌ (17 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 54), క్లాసెన్‌‌‌‌ (41) చివరి వరకు పోరాడారు. తిలక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన నాలుగో టీ20 శుక్రవారం జొహనెస్‌‌‌‌బర్గ్‌‌‌‌లో జరుగుతుంది.