కుక్కల దాడిలో జింక అప్పగింత

అలంపూర్, వెలుగు: ఉండవెల్లి మండలం అలంపూర్  చౌరస్తా సమీపంలోని పొలాల్లో కుక్కల దాడిలో గాయపడిన జింకను గమనించిన 133 కేవీ సబ్ స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్ఐ సుబ్బారెడ్డి, హోంగార్డ్​ రమేశ్ గాయపడిన జింకను అవుట్ పోస్ట్ కు తరలించి ఫారెస్ట్  ఆఫీసర్లకు అప్పగించారు. ఫారెస్ట్  బీట్  ఆఫీసర్  కీర్తి గాయపడిన జింకను ఉండవెల్లి వెటర్నరీ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు. జింకను మహబూబ్​నగర్  మయూరి పార్క్ కు తరలిస్తున్నట్లు ఎఫ్​బీవో తెలిపారు.