IPL Retention 2025: ఢిల్లీలో ధోనీతో పంత్‌ను చూశాను: రైనా హింట్ ఇచ్చేశాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను ఒక్కో ఫ్రాంచైజీ గురువారం (అక్టోబర్ 31) ప్రకటించింది. ఇందులో అనేక ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి.ముఖ్యంగా 2016 నుండి ఎనిమిది సీజన్లు ఆడిన తర్వాత టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకుండా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారుతుంది. ఇదిలా ఉంటే అంతలోనే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 

జియో సినిమాతో రైనా మాట్లాడుతూ.. "నేను మహేంద్ర సింగ్ ధోనిని ఢిల్లీలో కలిశాను. ఆ సమయంలో పంత్ కూడా అక్కడే ఉన్నాడు. ఏదో  పెద్ద విషయం జరగబోతుంది. ఎవరో (పంత్ ను ఉద్దేశించి)ఎల్లో కలర్ జెర్సీ వేసుకుంటారు అనిపిస్తుంది". అని చెప్పాడు. రైనా మాటలను చూస్తుంటే పంత్ ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోనున్నట్టు అర్ధమవుతుంది. నివేదికలు కూడా రిషబ్ పంత్ పై చెన్నై ఆసక్తి చూపిస్తున్నట్టు చెబుతున్నాయి. ధోనీ తర్వాత చెన్నైకి సరైన వికెట్ కీపర్ లేడు. ఒకవేళ పంత్ ను తీసుకుంటే అతను వికెట్ కీపింగ్ తో కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ఐపీఎల్ 2025 కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురిని రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జడేజాకు రూ. 18 కోట్ల రూపాయలు ఇచ్చారు. లంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానాకు రూ. 13 కోట్లు.. ఆల్ రౌండర్ శివమ్ దూబే రూ. 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ. 4 కోట్ల రూపాయలతో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. 

Also Read :- మూడు సార్లు సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్

మరోవైపు ఢిల్లీ నలుగురు రిటైన్ ప్లేయర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ 2025 మెగా ఆక్షన్ లోకి పాల్గొననుంది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు రూ. 16.50 కోట్లు, కుల్దీప్ యాదవ్ రూ. 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ కు రూ. 10 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అభిషేక్ పోరెల్ కు నాలుగు కోట్లు దక్కాయి. నలుగురు ప్లేయర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 47 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. వారు రూ. 73 కోట్లతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టబోతున్నారు.