సెల్ టవర్ పనులు నిలిపేయాలి : సురేందర్

కొల్లాపూర్, వెలుగు: మండలంలోని యన్మన్ భట్ల గ్రామంలో ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్  పనులను నిలిపేయాలని సీపీఎం నేత జల్లాపురం సురేందర్  డిమాండ్  చేశారు. ఇండ్ల మధ్యలో సెల్ టవర్  నిర్మించడంతో ప్రజలు రేడియేషన్  బారిన పడే ప్రమాదం ఉందన్నారు. 

ఇండ్ల నుంచి 500 మీటర్ల దూరంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రంగస్వామి, రామస్వామి, పరమేశ్​పాల్గొన్నారు.