ఉత్తర ప్రదేశ్ లో నిర్మించిన అయోధ్య రామ మందిరం 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి దాదాపు నెల ముందే గుజరాత్ సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరం ఇతివృత్తంపై ఒక వజ్రాల హారం తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. ఇది ఎంతగానే ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పోలి ఉండే డైమండ్ నెక్లెస్ కు 2 కిలోల వెండితో పాటు ఈ నెక్లెస్ డిజైన్‌లో 5 వేల అమెరికన్ వజ్రాలు ఉపయోగించారు. ఈ నెక్లెస్ లో రాముడు, లక్షణుడు, సీత,హనుమాన్ లను కూడా చూడొచ్చు. ఈ డిజైన్‌ను 40 మంది కళాకారులు 35 రోజుల్లో పూర్తి చేశారు. ఇది ఏ వాణిజ్య ప్రయోజనం కోసం కాదు... తాము దానిని రామ మందిరానికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాము అని వజ్రాల వ్యాపారి చెప్పాడు.
#WATCH | Gujarat: A diamond necklace has been made on the theme of Ram temple in Surat. 5,000 American diamonds have been used in this entire design.
— ANI (@ANI) December 19, 2023
The diamond necklace is made of 2 kg silver, 40 artisans completed this design in 35 days.
The diamond merchant said, “It is… pic.twitter.com/sf7jGmq1b5
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని నిర్మిస్తోన్న రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయ ప్రతిష్ఠకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ మహాక్రతువు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో అయోధ్యకు మొదటి వంద రోజుల్లో 1,000 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ప్రతిష్ఠ జరిగిన మర్నాడు నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు.
