పెగసస్ పై సోషల్ మీడియాలో చర్చలొద్దు

పెగసస్ పై సోషల్ మీడియాలో చర్చలొద్దు

పెగసస్ అంశంపై విచారణ 16కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. పెగసస్ ఇష్యూపై సోషల్ మీడియాలో సమాంతర చర్చ చేయొద్దని ఆదేశించింది. కేంద్రమైనా, పార్టీలైనా కోర్టులో విచారణ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. లోక్ సభలో ఓ వైపు చర్చ జరుగుతుండగానే..  పెగసస్ అంశంపై  చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని  బెంచ్ విచారణ జరిపింది. మరికొన్ని పిటిషన్ కాపీలు తమకు అందలేదని సుప్రీం దృష్టికి తెచ్చారు సోలిసిటర్ జనరల్. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై స్పందించేందుకు తమకు సమయం కావాలన్నారు. శుక్రవారానికి విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కోరారు. శుక్రవారం తాను అందుబాటులో ఉండనని... అన్ని పిటిషన్లు సోమవారం విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.