ప్రార్థనా స్థలాల చట్టాన్ని అమలు చేయండి : అసదుద్దీన్

  • సుప్రీంకోర్టులో ఎంఐఎం నేత అసదుద్దీన్ పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇదే అంశంపై గతంలో దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి విచారించేందుకు అంగీకరించింది.1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది గత నెల 17న పిటిషన్ వేశారు.

దీనిని సుప్రీంకోర్టు  గురువారం విచారించింది. ఒవైసీ తరఫున న్యాయవాది వాదిస్తూ..ప్రార్థనా స్థలాల చట్టంపై ఇప్పటికే కోర్టులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. తమ పిటిషన్ ను కూడా వాటితో జత చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది.